Sunday, March 21, 2010

నిందాపూర్వక ద్వేషపూర్వక బ్లాగులా WTF!!!!!!

కూడలి వీవెన్ గారి సొంత ఆస్తి కాబట్టి అందులో ఏ బ్లాగులను ఉంచాలి ఉంచకూడదు అన్న విషయం లో ఆయనకు పూర్తి స్వేచ్చ ఉంది.ఇప్పుడే ఈ ఉలికిపాటుకు కారణాలు ఎంటని కూడలిలో దారిన పోయే దానయ్యలాంటి నన్ను అడిగినా చెప్పగలడు.కెబ్లాస లో ఉన్న బ్లాగులకు కూడా కూడలి అవసరం కూడా లేదు, మన రాత లో సంగతి ఉంటే చదివేవాళ్ళు వెతుక్కొనైనా వచ్చి చదువుతారు.కాని ఇంత సడన్ గా కూడలి నిర్వాహకులకు పాఠకుల మనోభావాల గురించిన ఆలోచన ఎక్కడ గుచ్చితే వచ్చిందనేని నా ప్రశ్న ( నాకు తెలిసినా వారి నోటి నుండి వినాలని ఆ ఆశ ). ఒక రకంగా వీవెన్ ఈ పోల్ పెట్టడం ద్వారా కూడలి ఎవరికోసం నడప బడుతోందో తెలియచేశారు సంతోషం. సామెత పాతదే ఐనా అందరికీ ఇంకోసారి గుర్తు చేస్తాను

"పిచ్చనాయాళ్ళారా అర్థం చేసుకోండి మేము చెస్తే శ్రుంగారం మీరు చేస్తే వ్యభిచారం"

నువ్వు కూడా బూతులు రాస్తున్నావు ఫస్టు నీ బ్లాగే పీకేస్తామంటారా మంచిది(పీకడానికి నేను రాసింది కూడ ఎక్కువ లేదనుకొండి) I care a shit about it :-)

Saturday, March 13, 2010

Mid Night Show

రాత్రి 12 అవుతోంది, అంతా పడుకున్నారా లేక మెలకువలోనే ఉన్నారా, ఏంటో ఈ మధ్య రాత్రి 11 వరకు దాదాపు అందరు మేల్కొనే ఉంటున్నారు ఇంట్లో. వీళ్ళకు నిద్ర పట్టదా? త్వరగా అందరూ పడుకుంతే బాగుణ్ణు, నేను వెళ్ళి హాయిగా నా కంప్యుటర్లో నా ప్రోగ్రాం చూడొచ్చు.ఎవరికైనా నేను ఇవి చుస్తున్న్నానని తెలిస్తే? అమ్మో ఇంకేమన్న ఉందా నా పరువు మంటగలసి పోదు!!! అందుకే అందరూ పడుకున్నాక నేను వాటిని చూస్తుంటాను.

చివరికి ఈ మధ్య రూం లో కూడా చుడటం కుదరట్లేదు, ఆఫీస్ నుంచి వచ్చేసరికే రోజు రాత్రి 12 ఐపోతోంది, ఇంక ఈవన్ని చూడటానికి ఓపిక ఎక్కడ ఉంటుంది రాగానే పడుకోవడమే.హ్మ్.. ఇంతకు ముందు వేరే వాళ్ళు చుస్తున్నప్పుడు ఎంత వెక్కిరించే వాడిని, ఇప్పుడు నేను వాటిని చుస్తూ దొరికిపోతే?? ఇంక అంతే. అమ్మో నిద్ర వస్తొంది,

టైం ఎంతైది?? 12:30 పర్లేదు అందరు నిద్ర పోతుంటారు,ఇక మన పని మొదలు పెట్టొచ్చు, పిల్లి లాగా అడుగులో అడుగు వేసుకుంటు పక్క రూం లోకి వెళ్ళాను.లాప్టాప్ ఆన్ చేసాను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా ఒకె ఇంక మొదలు పెట్టొచ్చు, ఎందుకైనా మంచిది ఒక సారి అంతా పడుకున్నారో లేదో చెక్ చేద్దామనుకొని బయటకు వచ్చాను, హాపీస్ అంతా బాగా నిద్ర పోతున్నారు.వాకె ఇంక గంట సేపు నేను పండగ చేసుకో వచ్చు అనుకొని, రూం లోకి వచ్చాను. యూట్యూబ్ ఓపన్ చేశాను రాధా మధు అని టైప్ చేసి సెర్చ్ కొట్టాను ఎపిసోడ్ నంబర్ 51 షో స్టార్ట్.. ఇంక పండగే.